మదర్ థెరిస్సా దీనుల పాలిట దేవతగా నిలిచారని ఎంపీపీ కుమ్మరి సత్యరాజ్, స్థానిక సీఎస్‌ఐ సంఘ కాపరి రెవ జీఎం దినకర్ అన్నారు. మదర్ థెరిస్సా జయంతిని పురస్కరించుకొని శుక్రవారం స్థానిక సీఎస్‌ఐ వెస్లీ చర్చిలో మదర్ చిత్ర పటానికి నివాళులు అర్పించి కేక్ కట్ చేసి జయంతి వేడుకలు నిర్వహించారు
దీనుల దేవత మదర్ థెరిస్సా
Aug 27 2016 12:18 AM | Updated on Sep 4 2017 11:01 AM
గుడిహత్నూర్ : మదర్ థెరిస్సా దీనుల పాలిట దేవతగా నిలిచారని ఎంపీపీ కుమ్మరి సత్యరాజ్, స్థానిక సీఎస్‌ఐ సంఘ కాపరి రెవ జీఎం దినకర్ అన్నారు. మదర్ థెరిస్సా జయంతిని పురస్కరించుకొని శుక్రవారం స్థానిక సీఎస్‌ఐ వెస్లీ చర్చిలో మదర్ చిత్ర పటానికి నివాళులు అర్పించి కేక్ కట్ చేసి జయంతి వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జాతి వైషమ్యాలు లేకుండా దీనజనులకు అండగా నిలిచిన మాతృమూర్తి అని కొనియాడారు. మనుషుల్లోనే దేవుడిని చూశారని పేర్కొన్నారు. నిస్సహాయులకు నిరంతరం సహాయం అందించి విశ్వమాతగా నిలిచారని, ఆమె సేవలు చిరస్మరణీయమన్నారు. అనంతరం ప్రత్యేక దీవెనలు, ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు రత్నాకర్, రాజ్‌కుమార్, తారా రవి, సుద్దాల రాజు, ఇందిర సుకన్య, స్వప్న తదితరులు ఉన్నారు.
Advertisement


