అమెరికా: కెథడ్రల్ రాక్‌పై దాడి.. దుండగుల కోసం గాలింపు | US Forest Service Launches Manhunt for Cathedral Rock Defacers In Arizona Sedona, Watch Video Inside | Sakshi
Sakshi News home page

అమెరికా: కెథడ్రల్ రాక్‌పై దాడి.. దుండగుల కోసం గాలింపు

May 25 2026 9:56 AM | Updated on May 25 2026 10:11 AM

US Forest Service Launches Manhunt for Cathedral Rock Defacers

సెడోనా: అమెరికాలోని సెడోనాలో గల పవిత్రమైన ‘కెథడ్రల్ రాక్’పై దుండగులు దాడిచేశారు. స్థానిక అమెరికన్ల నమ్మకాలకు ప్రతీకగా నిలిచే ఈ చారిత్రక కట్టడంపై జరిగిన దాడిని అమెరికా ఫారెస్ట్ సర్వీస్ అత్యంత తీవ్రంగా పరిగణించింది. నిందితులను పట్టుకునేందుకు అధికారుల బృందం ప్రజల సహకారాన్ని కోరింది.

కెథడ్రల్ రాక్ కేవలం ఒక పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు. స్థానిక అమెరికన్ల సంస్కృతి, ఆధ్యాత్మికతకు చిహ్నం. అలాంటి పవిత్రమైన ప్రదేశాన్ని కొందరు వ్యక్తులు తమ వికృత చేష్టలతో అపవిత్రం చేయడంపై స్థానికులు, పర్యాటకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంస్కృతిని, ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని అంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. వీడియో ఆధారంగా, నిందితులను గుర్తించేందుకు అధునాతన ఏఐ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఈ ఏఐ విశ్లేషణ ద్వారా ఇద్దరు వ్యక్తుల ముఖచిత్రాలను అధికారులు స్పష్టంగా గుర్తించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
 

అధికారుల విజ్ఞప్తి
నిందితులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు అమెరికా ఫారెస్ట్ సర్వీస్ తెలిపింది. అలాగే ఈ ఘటనకు బాధ్యులైన వారి వివరాలు తెలిస్తే, వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. బహిరంగ ప్రదేశాలను, చారిత్రక కట్టడాలను కాపాడటంలో ప్రజల పాత్ర కీలమని అధికారులు గుర్తు చేశారు. ఈ దారుణానికి పాల్పడిన వారు త్వరలోనే చట్టం ముందు నిలబడతామని  అమెరికా ఫారెస్ట్ సర్వీస్ ఆశాభావం వ్యక్తం చేసింది.

ఇది కూడా చదవండి: భారత్ తొలి ‘కే- పాప్‌’ స్టార్‌.. మన ఒడిశా అమ్మాయే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement