సీఈ బాధ్యతల స్వీకరణ | ce takes charge | Sakshi
Sakshi News home page

సీఈ బాధ్యతల స్వీకరణ

Aug 8 2016 12:49 AM | Updated on Sep 27 2018 5:46 PM

జల వనరుల శాఖ కర్నూలు ప్రాజెక్ట్సు చీఫ్‌ ఇంజనీర్‌గా సి.నారాయణ రెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.

కర్నూలు సిటీ:
జల వనరుల శాఖ కర్నూలు ప్రాజెక్ట్సు చీఫ్‌ ఇంజనీర్‌గా సి.నారాయణ రెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు సీఈగా పని చేస్తున్న చిట్టిబాబు గత నెల 31న పదవి విరమణ కావడంతో హైదరాబాదులో చీఫ్‌ టెక్నికల్‌ అధికారిగా పని చేస్తున్న నారాయణ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు ప్రాజెక్ట్సు సీఈగా నియమించింది. ఈయన స్వస్థలం చిత్తూరు జిల్లా. ఈ మేరకు ఆయన బాధ్యతలు తీసుకునేందుకు ఆఫీస్‌కు రాగా సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం...పుష్కర పనుల పరిశీలనకు శ్రీశైలం వెళ్లారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement