లారీ డ్రైవర్‌ నుంచి నగదు అపహరణ | Sakshi
Sakshi News home page

లారీ డ్రైవర్‌ నుంచి నగదు అపహరణ

Published Thu, Dec 8 2016 10:27 PM

Cash theft from lorry driver

ధర్మవరం రూరల్‌: జాతీయ రహదారిలో బుధవారం రాత్రి ఆగి ఉన్న లారీలోని డ్రైవర్‌ నుంచి గుర్తు తెలియని వ్యక్తులు రూ.11,500, సెల్‌ఫోన్, వాచ్‌ ఎత్తుకెళ్లారు. ఈ మేరకు బాధితుడు పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. బాధితుడు, హైవే పోలీసుల సమాచారం మేరకు... మహారాష్ట్రకు చెందిన లారీ బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. జాతీయ రహదారిలోని దాదులూరు-శీతారాంపల్లి వద్దకు రాగానే అర్ధరాత్రి అయింది. మూత్ర విసర్జన కోసం లారీని డ్రైవర్‌ రోడ్డు పక్కన ఆపాడు. అదే సమయంలో బైక్‌పై అటుగా వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా డ్రైవర్‌ తలపై కట్టెతో కొట్టి రోడ్డు పక్కకు ఈడ్చుకెళ్లారు. ఆ తరువాత అతని జేబులోని నగదు, సెల్‌ఫోన్, వాచ్‌ను లాక్కెళ్లారు. హైవే పోలీసులు ఇచ్చిన సమాచారంతో డీఎస్సీ వేణుగోపాల్, సీఐ మురళీ కృష్ణ తమ సిబ్బందితో కలసి వెంటనే జాతీయ రహదారిపైకి వెళ్లి దుండగుల కోసం గాలించారు. 

 

 

Advertisement
 
Advertisement
 
Advertisement