ఏటీఎం వద్ద నిల్చున్న వారిపైకి దూసుకెళ్లిన కారు | car accident on atm queue line people | Sakshi
Sakshi News home page

ఏటీఎం వద్ద నిల్చున్న వారిపైకి దూసుకెళ్లిన కారు

Nov 26 2016 3:17 AM | Updated on Sep 4 2017 9:06 PM

ఏటీఎం వద్ద అర్ధరాత్రి క్యూలో నిల్చున్న వారిపైకి కారు వేగంగా దూసుకు రావడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యారుు.

హైదరాబాద్: ఏటీఎం వద్ద అర్ధరాత్రి క్యూలో నిల్చున్న వారిపైకి కారు వేగంగా దూసుకు రావడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యారుు. హైదరాబాద్ మెహిదీపట్నంలోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటున్న ఇంజనీరింగ్ విద్యార్థులు సొహైల్ (19), రిజ్వాన్ (19), నవీన్ (19) డబ్బుల కోసం గురువారం అర్ధరాత్రి నానల్‌నగర్‌లోని ఎస్‌బీఐ ఏటీఎం వద్దకు వెళ్లారు. అక్కడ జనాలు బారులు తీరి ఉన్నారు. దీంతో వారి వెనుక వరుసలో ముగ్గురు స్నేహితులు నిలబడ్డారు.

2.30 ప్రాంతంలో లంగర్‌హౌస్ నుంచి వచ్చిన తెలుపురంగు స్విఫ్ట్ కారు ఏటీఎం వద్ద నిలబ డిన వారిపైకి దూసుకెళ్లింది. దీంతో  రిజ్వాన్, నవీన్‌లకు తీవ్రగాయాలయ్యాయిు. సొహైల్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన అనంతరం కారు ఆపకుండా దూసుకుపోరుుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గురైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమో దు చేసిన పోలీసులు సీసీ ఫుటేజీల ఆధా రంగా కారు ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement