పర్యావరణ పరిరక్షణ పై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి సైకిల్ యాత్రను చేపట్టినట్లు ఎయిర్ ఫోర్స్ జవాన్ల టిన్ కమాండర్ ఎన్‌ఎస్‌కే సింగ్ పేర్కొన్నారు.
‘పర్యావరణం కోసమే యాత్ర’
Sep 20 2016 10:55 PM | Updated on Sep 4 2017 2:16 PM
నిర్మల్ టౌన్ : పర్యావరణ పరిరక్షణ పై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి సైకిల్ యాత్రను చేపట్టినట్లు ఎయిర్ ఫోర్స్ జవాన్ల టిన్ కమాండర్ ఎన్‌ఎస్‌కే సింగ్ పేర్కొన్నారు. వారు చేపట్టిన సైకిల్‌యాత్ర మంగళవారం పట్టణానికి చేరిన సందర్భంగా పట్టణ సీఐ జీవన్‌రెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎన్‌ఎస్‌కే సింగ్ మాట్లాడారు.
పర్యావరణ హితం కోసమే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని రూపొందించారన్నారు. ప్రజల్లో పర్యావరణంపై చైతన్యం తీసుకురావడానికి త్రివేండ్రం నుంచి గత నెల 15న సైకిల్‌యాత్ర చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటివరకు సైకిల్ యాత్ర 1700 కిలోమీటర్లకు చేరుకుందని వివరించారు. ప్రజల్లో పర్యావరణంపై అవగాహన ఏర్పడాలని తెలిపారు.
పర్యావరణ పరిరక్షణను బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. సైకిల్ యాత్ర ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్రల మీదుగా అక్టోబర్ 1న ఢిల్లీకి చేరుకుంటుందని పేర్కొన్నారు. 12 మంది సిబ్బందితో కూడిన బందం సైకిల్ యాత్రలో పాలుపంచుకుంటోంది. సైకిల్‌యాత్రకు స్వాగతం పలికిన వారిలో ట్రాఫిక్ ఎస్సై చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.
Advertisement
Advertisement