బస్సు-బైక్‌ ఢీ: టెన్త్‌ విద్యార్థి మృతి | Bus-Bike collide each other: one died | Sakshi
Sakshi News home page

బస్సు-బైక్‌ ఢీ: టెన్త్‌ విద్యార్థి మృతి

Mar 21 2017 5:34 PM | Updated on Sep 28 2018 3:41 PM

జిల్లాలోని మునుగోడు మండల కేంద్రం వద్ద మంగళవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది.

నల్లగొండ: జిల్లాలోని మునుగోడు మండల కేంద్రం వద్ద మంగళవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. కిష్టాపురానికి చెందిన నవీన్‌, వేణు అనే ఇద్దరు విద్యార్థులు పదో తరగతి పరీక్ష రాసి బైక్‌పై తిరిగి వస్తుండగా ఎదురుగా వస్తున్న నార్కట్‌పల్లి డిపోకు చెందిన బస్సు వారిని ఢీ కొట్టింది.
 
ఈ ఘటనలో నవీన్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. వేణు తీవ్రంగా గాయపడ్డాడు. కొనఊపిరితో ఉన్న వేణును ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement