పిడుగుపాటుకు ఎద్దు మృతి | bull died by thunderbolt | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు ఎద్దు మృతి

May 17 2017 11:18 PM | Updated on Sep 5 2017 11:22 AM

మండలంలోని పులకుర్తి గ్రామంలో బుధవారం తెల్లవారుజామున పిడుగు పడడంతో రైతు చిన్న తిక్కన్నకు చెందిన ఒక ఎద్దు మృతిచెందింది.

కోడుమూరు రూరల్‌: మండలంలోని పులకుర్తి గ్రామంలో బుధవారం తెల్లవారుజామున పిడుగు పడడంతో రైతు చిన్న తిక్కన్నకు చెందిన ఒక ఎద్దు మృతిచెందింది.అలాగే తెలుగు లక్ష్మన్నకు చెందిన ఇల్లు స్వల్పంగా దెబ్బతినింది. గ్రామంలో పదికిపైగా టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులు కాలిపోవడంతో సుమారు రూ.2లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితులు రంగన్న, లక్ష్మన్న, బుడ్డ వెంకటేష్‌ తదితరులు వాపోయారు.గాలివానకు ఒక ట్రాన్స్‌ఫారం, విద్యుత్‌ లైన్లు దెబ్బతిన్నాయి. ట్రాన్స్‌కో ఏఈ ప్రియాంక గ్రామాన్ని సందర్శించి సిబ్బందితో విద్యుత్‌లైన్లను పునరుద్ధరించే చర్యలను వేగవంతం చేశారు. నోడలాఫీసర్‌ భాస్కర్‌రెడ్డి, ఎంపీడీఓ అదెయ్య, ఏఓ అక్బర్‌బాషా, పశువైద్యాధికారులు నిర్మలమ్మ, చంద్రమౌళి ఘటనా స్థలానికి చేరుకొని బాధిత రైతును పరామర్శించి సాయం నిమిత్తం ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement