కృష్ణా జిల్లాలో దోపిడి దొంగల బీభత్సం | brutal murder at kankipadu, krishna district | Sakshi
Sakshi News home page

కృష్ణా జిల్లాలో దోపిడి దొంగల బీభత్సం

Mar 1 2017 7:09 AM | Updated on Sep 5 2017 4:56 AM

కృష్ణా జిల్లాలో దోపిడి దొంగల బీభత్సం

కృష్ణా జిల్లాలో దోపిడి దొంగల బీభత్సం

కృష్ణా జిల్లాలో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు.

కంకిపాడు (కృష్ణాజిల్లా) : కృష్ణాజిల్లా కంకిపాడు మసీదు సెంటర్ లో బుధవారం వేకువజామున దారుణం జరిగింది. కర్రి శ్రీదేవి అనే మహిళ ఒంటరిగా ఇంట్లో వుండటంతో దొంగలు చోరీకి ప్రయత్నించారు. ప్రతిఘటించిన శ్రీదేవిని గొంతు కోసి హతమార్చారు.  అనంతరం ఇంట్లో ఉన్న 70 కాసులు బంగారం .4 లక్షల నగదు ఆపహరించారు. మృతురాలి కుటుంబసభ్యులు తెల్లవారుజామున వచ్చి చూసే సరికి శ్రీదేవి మృతదేహం కనిపించింది. వెంటనే వారు కంకిపాడు పోలీసులకు సమాచారం అందించారు.

రాజమండ్రికి చెందిన కర్రి శ్రీనివాసరెడ్డి, శ్రీదేవి దంపతులు పదేళ్ళ కిందట కంకిపాడుకు వచ్చి స్థిరపడ్డారు. ఫైనాన్స్ వ్యాపారం చేసే శ్రీనివాసరెడ్డి తన కుమారుడు సతీష్ రెడ్డితో కలిసి తరచూ క్యాంప్ లకు వెళుతుంటాడు. ఇది గమనించిన నిందితులు శ్రీదేవి ఒంటరిగా వున్న సమయం చూసి ఆమెపై దాడిచేసి, ఇంట్లోని సొత్తును చోరీ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక టీములు ఏర్పాటుచేశారు. ఈ హత‍్య స్థానికంగా కలకలం సృష్టించింది.

Advertisement
 
Advertisement
Advertisement