పందుల దాడిలో బాలుడికి గాయాలు | Boy injured in Pigs attack | Sakshi
Sakshi News home page

పందుల దాడిలో బాలుడికి గాయాలు

Oct 28 2015 7:19 PM | Updated on Jul 12 2019 3:29 PM

పందుల దాడిలో బాలుడికి గాయాలు - Sakshi

పందుల దాడిలో బాలుడికి గాయాలు

అచ్చంపేట పట్టణంలోని జూబ్లీనగర్‌లో బుధవారం సాయంత్రం పందులదాడిలో ఏడాది బాలుడికి తీవ్రగాయాలయ్యాయి.

అచ్చంపేట రూరల్(మహబూబ్‌నగర్ జిల్లా): అచ్చంపేట పట్టణంలోని జూబ్లీనగర్‌లో బుధవారం సాయంత్రం పందులదాడిలో ఏడాది బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. జూబ్లీనగర్‌కు చెందిన కృష్ణ, నిహారిక దంపతుల కుమారుడు ధనుష్(1)పై ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా రెండు పందులు దాడి చేశాయి. హుటాహుటిన బాలుడిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా..14 కుట్లు పడ్డాయి. అచ్చంపేట ప్రాంతంలో పందుల బెడద ఎక్కువైందని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement