ముక్కుపచ్చలారని బాలుడొకడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. ధర్మాజీగూడెంకు చెందిన ముక్కు రాంబాబు, అరుణ దంపతులు వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు సాయి గోపాల్ (12) అదే గ్రామంలోని పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. ఈ నేప£ý ్యంలో ఎవరూ లేని సమయం చూసి సాయి గోపాల్ ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు.
ఉరి వేసుకుని బాలుడి ఆత్మహత్య
Aug 31 2016 12:01 AM | Updated on Jul 12 2019 3:02 PM
ఏలూరు అర్బన్ : ముక్కుపచ్చలారని బాలుడొకడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. ధర్మాజీగూడెంకు చెందిన ముక్కు రాంబాబు, అరుణ దంపతులు వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు సాయి గోపాల్ (12) అదే గ్రామంలోని పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. ఈ నేప£ý ్యంలో ఎవరూ లేని సమయం చూసి సాయి గోపాల్ ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. దీనిని గమనించిన ఇరుగుపొరుగు వారు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వీరు హుటాహుటిన బాలుడిని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయిగోపాల్ కన్నుమూశాడు. దీంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ధర్మాజీగూడెం ఎస్సై వి.క్రాంతికుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియకపోవడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.
Advertisement


