బాలికపై అత్యాచారం చేసిన కేసులో బాలుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. నిజామాబాద్ రూరల్ ఎస్‌హెచ్‌వో వెంకటేశ్వర్లు కథనం ప్రకారం..
అత్యాచారం కేసులో బాలుడి అరెస్టు
Jul 24 2016 8:47 PM | Updated on Jul 12 2019 3:02 PM
నిజామాబాద్ రూరల్ : బాలికపై అత్యాచారం చేసిన కేసులో బాలుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. నిజామాబాద్ రూరల్ ఎస్‌హెచ్‌వో వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. వినాయక విగ్రహాలు తయారు చేసి విక్రయించేందుకు గుజరాత్ నుంచి కొన్ని కుటుంబాలు వలస వచ్చాయి. కంఠేశ్వర్ బైపాస్ రోడ్డు ప్రాంతంలో తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకొని, విగ్రహాలు తయారు చేస్తున్నారు. ఓ కుటుంబానికి చెందిన ఏడేళ్ల బాలికపై, అదే ప్రాంతానికి చెందిన బాలుడు (15) శుక్రవారం అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. బాధితురాలిని వైద్యపరీక్షల నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Advertisement
Advertisement


