తూర్పుగోదావరి జిల్లాలో గురువారం తెల్లవారుజామున బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించింది.
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలో గురువారం తెల్లవారుజామున బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించింది. రాజమండ్రి దివాస్ చెరువు 4వ వంతెన వద్ద ఆటోలో వెళ్తున్న ప్రయాణికులను బెదిరించి దాడికి తెగబడింది.
ఈ దాడిలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారి నుంచి నగలు, నగదును బ్లేడ్ బ్యాచ్ దోచుకెళ్లారు. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.