గడపగడపకూ బీజేపీ | BJP office started | Sakshi
Sakshi News home page

గడపగడపకూ బీజేపీ

Feb 20 2017 10:11 PM | Updated on Mar 29 2019 9:31 PM

గడపగడపకూ బీజేపీ - Sakshi

గడపగడపకూ బీజేపీ

గడపగడపకూ భారతీయ జనతా పార్టీని తీసుకెళ్లాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రతాపరామకృష్ణ కోరారు.

►కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేద్దాం
► బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాపరామకృష్ణ

ముస్తాబాద్‌ : గడపగడపకూ భారతీయ జనతా పార్టీని తీసుకెళ్లాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రతాపరామకృష్ణ కోరారు.  మండల కేంద్రంలో బీజేపీ కార్యాలయాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్రమోదీ నాయకత్వంలో భారత దేశం అభివృద్ధిబాటలో పయనిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను పల్లెల్లో ప్రజలకు చేరవేయడంలో కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని కోరారు.

గ్రామీణస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. విభేదాలను పక్కనపెట్టి సమష్టిగా పనిచేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలని, ప్రజలను ఆ దిశగా చైతన్యవంతులను చేయాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మేర్గు హన్మంతుగౌడ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఎంపెల్లి వంశీకృష్ణ, కిసాన్ మోర్చా అధ్యక్షుడు మల్లారెడ్డి, మండల అధ్యక్షుడు రాంగోపాల్, పట్టణ అధ్యక్షుడు దేవేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement