జనగామ నియోజకవర్గం పరిధిలో వరుస ద్విచక్రవాహనాలను చోరీ చేస్తున్న వ్యక్తిని పట్టుకుని రిమాండ్‌కు పంపించినట్లు డీఎస్పీ పద్మనాభరెడ్డి తెలిపారు.
బైక్‌ల దొంగ అరెస్టు
Sep 4 2016 12:24 AM | Updated on Sep 4 2017 12:09 PM
జనగామ : జనగామ నియోజకవర్గం పరిధిలో వరుస ద్విచక్రవాహనాలను చోరీ చేస్తున్న వ్యక్తిని పట్టుకుని రిమాండ్‌కు పంపించినట్లు డీఎస్పీ పద్మనాభరెడ్డి తెలిపారు. శనివారం పట్టణ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ ముసికె శ్రీనివాస్‌తో కలిసి డీఎస్పీ మాట్లాడారు. బచ్చన్నపేట మండ లం కొన్నె గ్రామానికి చెందిన పాత నేరస్తుడు యాట రమేష్ గత కొంత కాలంగా బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నాడన్నారు. కోర్టు సమీపంలో సీఐ ముసికె శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా రమేష్ పారి పోయే ప్రయత్నం చేశాడన్నారు. అనుమానం కలిగి పోలీసులు పట్టుకుని స్టేషన్‌కు తరలించి విచారణ చేశామన్నారు. అతడు ఇచ్చిన సమాచారంతో రూ.2లక్షల విలువ చేసే నాలుగు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. రమేష్‌ను రిమాండ్‌కు పంపించినట్లు పేర్కొన్నారు. డీఎస్పీ వెంట ఎస్సై సంతోషం రవిందర్, సిబ్బంది ఉన్నారు.
Advertisement
Advertisement