నాణ్యమైన ఉత్పత్తి సాధించాలి | best product the coal | Sakshi
Sakshi News home page

నాణ్యమైన ఉత్పత్తి సాధించాలి

Sep 21 2016 7:10 PM | Updated on Sep 4 2017 2:24 PM

మాట్లాడుతున్న సీజీఎం వెంకటేశ్వరరావు

మాట్లాడుతున్న సీజీఎం వెంకటేశ్వరరావు

గోదావరిఖని/యైటింక్లయిన్‌కాలనీ : సింగరేణిలో నాణ్యమైన బొగ్గు ఉత్పత్తికి అందరూ కృషి చేయాలని ఆర్జీ–1 సీజీఎం, ఆర్జీ–2 ఇన్‌చార్జి సీజీఎం వెంకటేశ్వర్‌రావు కోరారు. ఆర్జీ–1 పరిధిలోని జీడీకే–1వ గని, ఆర్జీ–2 పరిధిలోని ఓసీపీ–3 కృషిభవన్‌లో బుధవారం వేర్వేరుగా నిర్వహించిన మల్టీడిపార్ట్‌మెంటల్‌ సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

  • మల్టీ డిపార్ట్‌మెంట్‌æ కమిటీ సమావేశాల్లో సీజీఎం వెంకటేశ్వరరావు
  • గోదావరిఖని/యైటింక్లయిన్‌కాలనీ : సింగరేణిలో నాణ్యమైన బొగ్గు ఉత్పత్తికి అందరూ కృషి చేయాలని ఆర్జీ–1 సీజీఎం, ఆర్జీ–2 ఇన్‌చార్జి సీజీఎం వెంకటేశ్వర్‌రావు కోరారు. ఆర్జీ–1 పరిధిలోని జీడీకే–1వ గని,  ఆర్జీ–2 పరిధిలోని  ఓసీపీ–3 కృషిభవన్‌లో బుధవారం వేర్వేరుగా నిర్వహించిన మల్టీడిపార్ట్‌మెంటల్‌ సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గతేడాది ఉద్యోగులందరూ మల్టీ డిపార్ట్‌మెంట్‌ కమిటి ద్వారా సమావేశాలు నిర్వహించుకుని ఆయా గనులు, డిపార్ట్‌మెంట్ల సహాయ సహకారాలతో, సమన్వయంతో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని సంస్థను లాభాల బాట పట్టించారని తెలిపారు. ఈసారి వర్షాల కారణంగా సెప్టెంబర్‌ వరకు ఉత్పత్తి, ఉత్పాదకత విషయంలో కొంత వెనుకబడి ఉన్నామని, దీనిని అధిగమించి ఉత్పత్తి లక్ష్యాలు సాధించడానికి అంకితభావంతో పని చేయాలని సూచించారు. అధికారులు, ఉద్యోగులు ప్రణాళిక బద్దంగా ముందుకు సాగితే వార్షిక ఉత్పత్తి లక్ష్యాలను సాధిం^è డం పెద్ద కష్టమేమీ కాదని అన్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో బొగ్గుకు డిమాండ్‌ తగ్గిపోయిందన్నారు. విదేశాలను నుంచి తక్కువ ధరకే బొగ్గు మార్కెట్‌లోకి దిగుమతి కావడంతో బొగ్గు ధరలు పడిపోయాయని తెలిపారు. విద్యుత్‌ సంస్థలకు సరఫరా చేసే బొగ్గు ధరను పెంచే అవకాశం లేకుండా పోయిందని, కేవలం సిమెంట్‌ పరిశ్రమలకు సరఫరా చేసే బొగ్గు ధరమాత్రమే మనచేతుల్లో ఉందన్నారు. దీనికోసం ఇ–యాక్షన్‌ ద్వారాబొగ్గు అమ్మకాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కేవలం ఉద్యోగులపై ఒత్తిడి పెంచి అధికారులు చేతులు ఎత్తేస్తే కాదని అందరూ కలిసికట్టుగా ముందుకు సాగితేనే ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందన్నారు. భారీ యంత్రాల నిర్వహణపై దృష్టిసారించి పనిగంటలు పెంచుకోవాలని సూచించారు. సంస్థ మిగులు బడ్జెట్‌ కోసం అవుట్‌ సోర్సింగ్, ట్రాన్స్‌పోర్టు కోల్‌కాంట్రాక్టు ద్వారా పనులు నిర్వహిస్తుందని తెలిపారు. ఇది ఎంతో కాలం ఉండబోదన్నారు. రాబోయే రోజుల్లో కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచకతప్పదని పేర్కొన్నారు. ఇప్పటికే ట్రాన్స్‌పోర్టు ధరలు విపరీతంగా పెరిగాయని, ఇలాంటి పరిస్థితుల్లో సంస్థ పరిస్థితి అర్థం చేసుకుని ముందుకు సాగాలన్నారు. సమావేశాల్లో ఐఈడీ ఏజీఎం ప్రసాద్‌రావు, ఏరియా సేఫ్టీ ఆఫీసర్‌ కేవీ.రావు సాధించాల్సిన ఉత్పత్తి, ఉత్పాదకత వివరాలను, కంపెనీ ఎదుర్కొంటున్న సవాళ్లు, రక్షణ పరమైన చర్యలు, అందరి బాధ్యత తదితర విషయాలపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. సమావేశాల్లో ఎస్‌ఓటూ సీజీఎం సుధాకర్‌రెడ్డి, ఎస్‌వోటూ జీఎం రవీందర్, ఏజెంట్లు సాంబయ్య, రమేశ్, పర్సనల్‌ డీజీఎం బి.హనుమంతరావు, ఎన్‌వీ.రావు, ఈఅండ్‌ఎం ఏజీఎం సాయిరాం, ఫైనాన్స్‌ డీజీఎం రాజేశ్వర్‌రావు, క్వాలిటీ డీజీఎం భైరయ్య, మేనేజర్లు బీవీ.రమణ, వెంకటయ్య, సంక్షేమాధికారి శ్రీనివాస్, నాయకులు సారంగపాణి, యాదగిరి సత్తయ్య, షబ్బీర్‌అహ్మద్, రమేశ్‌రెడ్డి, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement