మృత్యువుతో పోరాడుతున్న ఎలుగుబంటి | Bear struggling to live | Sakshi
Sakshi News home page

మృత్యువుతో పోరాడుతున్న ఎలుగుబంటి

Aug 23 2016 11:54 PM | Updated on Sep 4 2017 10:33 AM

ఇందిరా గాందీ జూ పార్కులో ఓ ఎలుగుబంటి (స్లాత్‌బేర్‌) కొద్ది రోజులుగా మృత్యువుతో పోరాడుతోంది. సుమారు పదేళ్ల వయసున్న ఈ ఎలుగుబంటి కొన్ని రోజులగా అనారోగ్యంతో బాధపడుతోంది. జూ వైద్యుడు వైద్యం అందించినా ఎలాంటి మార్పూ కనిపించలేదు.

ఆరిలోవ: ఇందిరా గాందీ జూ పార్కులో ఓ ఎలుగుబంటి (స్లాత్‌బేర్‌) కొద్ది రోజులుగా మృత్యువుతో పోరాడుతోంది. సుమారు పదేళ్ల వయసున్న ఈ ఎలుగుబంటి కొన్ని రోజులగా అనారోగ్యంతో బాధపడుతోంది. జూ వైద్యుడు వైద్యం అందించినా ఎలాంటి మార్పూ కనిపించలేదు. దీంతో జూ అధికారులు ఎలుగుబంట్లకు ప్రత్యేకంగా వైద్యం అందించే నిపుణులను కర్నాటకలోని బెన్నర్‌హట్టి రెండు రోజుల క్రితం తీసుకొచ్చారు. వారు ఎలుగుబంటికి ప్రత్యేక పరీక్షలు నిర్వహించి కాలేయ భాగం కేన్సర్‌కు గురైనట్లు నిర్ధారించినట్లు తెలిసింది. మందులు కూడా కర్నాటక ప్రాంతం నుంచే జూ అధికారులు తీసుకొస్తున్నారు. అయితే ఎక్కవ కాలం ఈ ఎలుగుబంటి బతికే అవకాశంలేదని బెన్నర్‌హట్టి జూ పార్కు వైద్యులు చెప్పినట్లు తెలిసింది. అయినా జూ అధికారులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం చేయకుండా ఎలుగుబంటికి వైద్య సేవలందిస్తుండడం విశేషం.

Advertisement
 
Advertisement
Advertisement