పలమనేరు ప్రభుత్వాస్పత్రిలో శిశుమరణం | baby died in palamaner governmernt hospital | Sakshi
Sakshi News home page

పలమనేరు ప్రభుత్వాస్పత్రిలో శిశుమరణం

Sep 10 2016 12:19 AM | Updated on Sep 4 2017 12:49 PM

మృతి చెందిన శిశువు

మృతి చెందిన శిశువు

పలమనేరు ప్రభుత్వాస్పత్రిలో గురువారం రాత్రి ఓ శిశువు మరణించింది. పలమనేరు మండలం మండిపేట గ్రామానికి చెందిన బాలకష్ణ తన భార్య ఝాన్సీని ప్రసవం కోసం బుధవారం ఆస్పత్రికి తీసుకొచ్చాడు. బుధ, గురువారాలు ఆమెకు డాక్టర్లు చికిత్స చేశారు.

– డాక్టర్ల నిర్లక్ష్యమని బంధువుల ఆరోపణ 
గంగవరం : పలమనేరు ప్రభుత్వాస్పత్రిలో గురువారం రాత్రి ఓ శిశువు మరణించింది. పలమనేరు మండలం మండిపేట గ్రామానికి చెందిన బాలకష్ణ తన భార్య ఝాన్సీని ప్రసవం కోసం బుధవారం ఆస్పత్రికి తీసుకొచ్చాడు. బుధ, గురువారాలు ఆమెకు డాక్టర్లు చికిత్స చేశారు. గురువారం అర్ధరాత్రి ఆమెకు నొప్పులు ఎక్కువయ్యాయి. డ్యూటీలో ఉన్న డాక్టర్లు ఆపరేషన్‌ చేశారు అప్పటికే బిడ్డ మతి చెందినట్లు డాక్టర్లు బంధువులకు తెలిపారు. శుక్రవారం బంధువులు ఆస్పత్రి డాక్టర్ల నిర్లక్ష్యమే బిడ్డమతికి కారణమని ఆరోపించారు. ఆ మేరకు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ వీణాకుమారికి ఫిర్యాదు చేశారు. సూపరింటెండెంట్‌ డ్యూటీ డాక్టర్లను పిలిచి విచారణ జరిపించగా, ఆమెకు బీపీ పెరగడంతో చేసేదిలేక ఆపరేషన్‌ చేసి బిడ్డను తీశామని, తల్లిని కాపాడ్డానికే ఆపరేషన్‌ చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావత్తం కాకూడదని డాక్టర్లను బంధువులు హెచ్చరించారు.
09పిఎల్‌ఎన్‌ఆర్‌10: డాక్టర్లను విచారిస్తున్న ఆస్పత్రి సూపరింటెండెంట్‌ వీణాకుమారి 
09పిఎల్‌ఎన్‌ఆర్‌11:
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement