ఆటోబోల్తా మహిళ మృతి | Auto roll over, women died | Sakshi
Sakshi News home page

ఆటోబోల్తా మహిళ మృతి

Aug 18 2016 11:20 PM | Updated on Sep 28 2018 3:41 PM

ఆటోబోల్తా మహిళ మృతి - Sakshi

ఆటోబోల్తా మహిళ మృతి

రెడ్డిగూడెం (తుంగతుర్తి) : ఆటోబోల్తా పడి మహిళ మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి రెడ్డిగూడెం గ్రామ శివారులో చోటు చేసుకుంది.

రెడ్డిగూడెం (తుంగతుర్తి) : ఆటోబోల్తా పడి మహిళ మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి రెడ్డిగూడెం గ్రామ శివారులో చోటు చేసుకుంది. పోలీసులు, మృతిరాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని రెడ్డిగూడెం గ్రామానికి చెందిన అంగన్‌వాడీ ఆయా కొలిపాక దేవకమ్మ (60) ఉయ్యాల రజిత, ఉయ్యాల పవన్, సూర్యాపేట ఆసుపత్రికి వెళ్లి తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలో మద్దిరాల ఎక్స్‌రోడ్డు వద్ద బస్సు దిగి తన స్వగ్రామం రెడ్డిగూడానికి తునికి కుమార స్వామి ఆటోలో వస్తున్నారు. రెడ్డిగూడెం శివారులో స»Œ స్టేషన్‌ వద్దకు రాగానే ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న దేవకమ్మ అక్కడికక్కడే మృతి చెందింది.  ఉయ్యాల రజిత, పవన్, గుర్రాల ప్రవీణ్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు. వీరిలో రజిత పరిస్థితి విషమంగా ఉంది. మృతురాలి కుమారుడు కొలిపాక వెంకన్న ఫిర్యాదు మేరకు  హెడ్‌కానిస్టేబుల్‌ రాంకోటి కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ఆసుపత్రికి తరలించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement