అనంతపురం సెంట్రల్ : రూరల్ మండలం పిల్లిగుండ్లకాలనీలో చాంద్‌బాషా(22) అనే ఆటోడ్రైవర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల కథనంమేరకు... స్థానికంగా నివాసముంటున్న ఇబ్రహీం కుమారుడైన చాంద్‌బాషా గతంలో పెయింటర్‌గా పని చేసేవారు.
ఉరేసుకుని ఆటోడ్రైవర్ ఆత్మహత్య
Jan 24 2017 12:29 AM | Updated on Nov 6 2018 7:53 PM
అనంతపురం సెంట్రల్ : రూరల్ మండలం పిల్లిగుండ్లకాలనీలో చాంద్‌బాషా(22) అనే ఆటోడ్రైవర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల కథనంమేరకు... స్థానికంగా నివాసముంటున్న ఇబ్రహీం కుమారుడైన చాంద్‌బాషా గతంలో పెయింటర్‌గా పని చేసేవారు. ఇటీవల ఆటో నడుపుకొంటున్నారు. ఒక రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో అప్పటినుంచి కొంత మానసిక అనారోగ్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నారు. టూటౌ¯ŒS పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement


