తల్లీకూతుళ్లపై కత్తితో దాడి | attack on mother and daughter | Sakshi
Sakshi News home page

తల్లీకూతుళ్లపై కత్తితో దాడి

Dec 1 2016 2:13 AM | Updated on Sep 4 2017 9:32 PM

తల్లీకూతుళ్లపై కత్తితో దాడి

తల్లీకూతుళ్లపై కత్తితో దాడి

సరిహద్దు తగాదా నేపథ్యంలో ఓ వ్యక్తి కత్తితో దాడి చేయడంతో తల్లీకూతుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో బుధవారం జరిగింది.

కొవ్వూరు రూరల్‌ : సరిహద్దు తగాదా నేపథ్యంలో ఓ వ్యక్తి కత్తితో దాడి చేయడంతో తల్లీకూతుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో బుధవారం జరిగింది. బాధితులు, స్థానికుల కథనం ప్రకారం.. ఉప్పులూరి వరలక్ష్మి, ఆమె కుమార్తె శశిరేఖ కొత్త ఇల్లు నిర్మించుకుంటున్నారు. ఈ క్రమంలో గద్దె వెంకట సుబ్బారావు ఇంటివైపున తమ స్థలంలో ఉన్న మందార మొక్కను తొలగిస్తుండగా..  వెంకట సుబ్బారావు వారిని అడ్డుకున్నాడు. దీంతో వివాదం రేగింది.  ఆగ్రహానికి గురైన వెంకట సుబ్బారావు తన చేతిలో ఉన్న కత్తితో వరలక్షి్మ తలపైన, ఎడమ భుజంపైన నరికాడు. అడ్డుగా వెళ్లిన వరలక్ష్మి కుమార్తె శశిరేఖను రెండు చేతులపై నరికాడు. దీంతో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.  దీంతో స్థానికులు పోలీసులకు, 108కు సమాచారం ఇచ్చారు. కొవ్వూరులో 108 అందుబాటులో లేకపోవడంతో పోలవరం నుంచి ఆ వాహనం వచ్చే సరికి ఆలస్యమైంది. బాధితులు రెండుగంటలపాటు రక్తపు మడుగుల్లో విలవిల్లాడారు. అనంతరం వచ్చిన వాహనం వారిని కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement