ఏటీఎం మిషన్లలో చోరీ | atm mitions robbery in kothapalli village | Sakshi
Sakshi News home page

ఏటీఎం మిషన్లలో చోరీ

Jun 8 2016 9:23 AM | Updated on Aug 30 2018 5:27 PM

ఏటీఎం మిషన్లలో చోరీ - Sakshi

ఏటీఎం మిషన్లలో చోరీ

మండలంలోని కొత్తపల్లి గ్రామంలో సోమవారం రాత్రి రెండు ఏటీఎంలలో దొంగలు పడి రూ.16,700లు ఎత్తుకెళ్లారు.

రూ.16,700 అపహరణ.. రూ.5 లక్షలు భద్రం

 పాపన్నపేట: మండలంలోని కొత్తపల్లి గ్రామంలో సోమవారం రాత్రి రెండు ఏటీఎంలలో దొంగలు పడి రూ.16,700లు ఎత్తుకెళ్లారు. కాగా, సేఫ్‌లాకర్‌లోని రూ.5లక్షలు మాత్రం భద్రంగా ఉన్నాయి. పాపన్నపేట ఎస్సై సందీప్‌రెడ్డి కథనం ప్రకారం... కొందరు దుండగులు సోమవారం రాత్రి గడ్డపారలు తీసుకొచ్చి టాటా ఇండికం ఏటీఎం షట్టర్ పగలగొట్టారు. లోనికి ప్రవేశించి రెండు ఏటీఎం మిషన్‌లను ధ్వంసం చేసి రూ.16,700 దోచేశారు. సేఫ్ లాకర్ తెరచుకోకపోవడంతో అందులో ఉన్న రూ.5 లక్షలు భద్రంగా మిగిలిపోయాయి. కాగా, సీసీ పుటేజీలో చోరీ తాలూకు దృశ్యాలు నమోదయ్యాయి. ఈ మేరకు పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలిసింది. సంఘటన స్థలాన్ని మెదక్ రూరల్ సీఐ రామకృష్ణ, పాపన్నపేట ఎస్సై సందీప్‌రెడ్డి, క్లూస్‌టీం, ఏఎస్‌ఐ రాజశేఖర్ సందర్శించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement