సీఎంగా చంద్రబాబు ఉన్నంత వరకూ ఇంతే.. | apcc chief raghuveera takes on cm chandrababu | Sakshi
Sakshi News home page

సీఎంగా చంద్రబాబు ఉన్నంత వరకూ ఇంతే..

Oct 9 2016 4:13 PM | Updated on Aug 18 2018 9:03 PM

సీఎంగా చంద్రబాబు ఉన్నంత వరకూ ఇంతే.. - Sakshi

సీఎంగా చంద్రబాబు ఉన్నంత వరకూ ఇంతే..

చంద్రబాబు రైతుల సమస్యలను పట్టించుకోవడంలేదని ఏపీసీసీ చీఫ్ ఎన్ రఘువీరా రెడ్డి విమర్శించారు.

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల సమస్యలను పట్టించుకోవడంలేదని ఏపీసీసీ చీఫ్ ఎన్ రఘువీరా రెడ్డి విమర్శించారు. కరువు మండలాలను ప్రకటించడంలో చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు.

కరువు రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రఘువీరా రెడ్డి అనంతపురం జిల్లాలో ఆదివారం పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు లేక పంటలు ఎండిపోతే చంద్రబాబు రెయిన్ గన్స్ పేరుతో రైతులను మోసం చేశారని విమర్శించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నంత వరకు ఏపీలో కరువు ఉంటుందని రఘువీరా అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement