‘అనంత’ ఓటమి! | anantapur lost the match | Sakshi
Sakshi News home page

‘అనంత’ ఓటమి!

Jul 20 2017 11:01 PM | Updated on Jun 1 2018 8:31 PM

‘అనంత’ ఓటమి! - Sakshi

‘అనంత’ ఓటమి!

అండర్‌-19 బాలిక అంతర్‌జిల్లాల క్రికెట్‌ టోర్నీలో స్వయం తప్పిదాలతో అనంత జట్టు ఓటమి పాలైంది.

అనంతపురం న్యూసిటీ : అండర్‌-19 బాలిక అంతర్‌జిల్లాల క్రికెట్‌ టోర్నీలో స్వయం తప్పిదాలతో అనంత జట్టు ఓటమి పాలైంది. లో నెట్‌ రన్‌రేట్‌ ‘అనంత’కు ట్రోఫీని దూరం చేసింది. 1.06 నెట్‌ రన్‌రేట్‌ (12 పాయింట్లు)తో చిత్తూరు జట్టు టోర్నీ విజేతగా నిలిచింది. మూడో స్థానంలో కర్నూలు, నాల్గో స్థానంలో నెల్లూరు, ఐదో స్థానంలో వైఎస్సార్‌ జిల్లా జట్లు నిలిచాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీగా పద్మజ(చిత్తూరు) నిలిచారు. టోర్నీ ముగింపు కార్యక్రమానికి ఆర్డీటీ హాస్పిటాలిటీ డైరెక్టర్‌ విశాల ఫెర్రర్‌ హాజరై ట్రోఫీలను అందజేశారు. కార్యక్రమంలో ఏసీఏ సౌత్‌జోన్‌ కార్యదర్శి నాగేశ్వరరావు, ఆర్డీటీ స్పోర్ట్స్‌ డైరెక్టర్‌ నిర్మల్‌కుమార్, ఏడీసీఏ కార్యదర్శి షాబుద్దీన్, సెలెక్టర్‌ ధనుంజయరెడ్డి, టోర్నీ పరిశీలకులు రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement