'మా నాయకుడి ముందు నువ్వు బచ్చా' | anam vivekananda reddy group leaders takes on abdul aziz | Sakshi
Sakshi News home page

'మా నాయకుడి ముందు నువ్వు బచ్చా'

Jun 22 2016 10:27 AM | Updated on Aug 10 2018 9:42 PM

'మా నాయకుడి ముందు నువ్వు బచ్చా' - Sakshi

'మా నాయకుడి ముందు నువ్వు బచ్చా'

‘ఆనం వివేకానందరెడ్డి ముందు నువ్వు బచ్చా’ అని మాజీ కార్పొరేటర్ మునాఫ్ మేయర్ అబ్దుల్ అజీజ్ పై మండిపడ్డారు.

అజీజ్.. నువ్వు ముస్లింల పరువు తీస్తున్నావు
ఆనం వర్గం మైనార్టీ నాయకుడు మునాఫ్
 
నెల్లూరు :  ‘ఆనం వివేకానందరెడ్డి ముందు నువ్వు బచ్చా’ అని మాజీ కార్పొరేటర్ మునాఫ్ మేయర్ అబ్దుల్ అజీజ్ పై మండిపడ్డారు. ఏసీ సెంటర్‌లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.  మైనార్టీలను అడ్డంపెట్టుకుని రూ.కోట్లు దండుకున్న అజీజ్  తమ నాయకుడు వివేకానందరెడ్డిని  విమర్శించడం సరికాదన్నారు. ఎంతో మంది మైనార్టీలు నెల్లూరులో నాయకులుగా ఎదిగారన్నారు.
 
 అయితే రాజకీయాల్లోకి వచ్చిన రెండేళ్లకే అజీజ్‌కు అవినీతిపరుడుగా ముద్రపడిందన్నారు. ఆయన వల్ల   మైనార్టీలందరికీ చెడ్డపేరు వస్తోందన్నారు. రొయ్యలు వ్యాపారం చేసుకో కానీ ఆనం వివేకాందరెడ్డిని విమర్శిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. అజీజ్ నెల్లూరు కార్పొరేషన్‌లో దందాలు చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి నారాయణ అజీజ్‌ను తిక్క పనులు చేస్తున్నావని చెప్పిన విషయం గుర్తుచేశారు.
 
అజీజ్ పోటీ చేసిన, ఆయన తమ్ముడు పోటీ చేసిన స్థానంలో గెలుపొందేందుకు రూ.4 కోట్లు ఖర్చు చేశారన్నారు. నెల్లూరులో ఆనం బలం తెలుసు కాబట్టే  చంద్రబాబునాయుడు స్వయంగా కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారని తెలిపారు. కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తన కార్పొరేటర్లను అజీజ్‌కు హోల్‌సేల్‌గా అమ్మేశారని ఆరోపించారు.  ఇప్పటికైనా శ్రీని వాసులురెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.  ఈ సమావేశంలో ఆనం వర్గీయులు ముజీర్, అలియాజ్, షమీమ్, ఏజాస్, నిస్సార్  పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement