ఆల్‌టైం మందుల మిషన్‌ ప్రారంభం | all time medicine machine starts | Sakshi
Sakshi News home page

ఆల్‌టైం మందుల మిషన్‌ ప్రారంభం

Oct 30 2016 1:34 AM | Updated on Oct 16 2018 3:26 PM

ఆల్‌ టైం మందుల పంపిణీ మిషన్‌ను రోగులు సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ యుగంధర్‌ తెలిపారు.

ధర్మవరం రూరల్‌ : ఆల్‌ టైం మందుల పంపిణీ మిషన్‌ను రోగులు సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ యుగంధర్‌ తెలిపారు.    శనివారం మండల పరిధిలోని దర్శనమల పీహెచ్‌సీలో ఈ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యులు అందుబాటులో లేని సమయంలో ఏఎన్‌ఎంల సహాయంతో బటన్‌ నొక్కి రోగులు మందులను తీసుకెళ్లవచ్చన్నారు. నంబర్ల ఆధారంగా ఏ మందులు కావాలో వాటికి సంబంధించిన నంబర్లు నొక్కితే మందులు బయటకు వస్తాయన్నారు. జిల్లాలో రాయదుర్గం నియోజవర్గంలోని నాగలాపురం, దర్శనమల పీహెచ్‌సీలో మిషన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. డాక్టర్‌ చెన్నారెడ్డి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement