
టాప్ 500 కంపెనీల్లో 49.5 శాతానికి డౌన్
ముంబై: ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో దేశీయంగా టాప్ 500 కంపెనీల్లో ప్రమోటర్ల వాటా ఆల్‌టైమ్ కనిష్ట స్థాయి అయిన 49.5 శాతానికి తగ్గింది. గత ఏడాది కాలంగా షేర్ల వేల్యుయేషన్లు, ఇన్వెస్టర్ల ఆసక్తి బాగుండటంతో పలువురు ప్రమోటర్లు తమ వాటాల్లో కొంత భాగాన్ని విక్రయించడం ఇందుకు కారణం. నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, టెలికం, ఎల్రక్టానిక్స్ తయారీ సేవల కంపెనీలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు మొదలైన విభాగాల్లో నాలుగో త్రైమాసికంలో ప్రమోటర్ల వాటాలు తగ్గాయి.
డిసెంబర్ క్వార్టర్‌తో పోలిస్తే ప్రమోటర్ల షేర్‌హోల్డింగ్ 49.8 శాతం నుంచి 30 బేసిస్ పాయింట్లు తగ్గగా, వార్షికంగా చూస్తే 50.9 శాతం నుంచి 140 బేసిస్ పాయింట్లు తగ్గింది. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నివేదిక ప్రకారం ప్రైమరీ మార్కెట్లో సానుకూల పరిస్థితులు ఉండటంతో క్విప్‌లు (క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్), ఇతరత్రా మార్గాల్లో ప్రమోటర్లు తమ వాటాల్లో కొంత భా గాన్ని విక్రయించారు. గత రెండు దశాబ్దాల్లో దేశీ కంపెనీల్లో అత్యధిక వాటా ప్రమోటర్లదే కొనసాగుతూ వచ్చింది. ఆ తర్వాత స్థానాల్లో వి దేశీ సంస్థలు, దేశీ సంస్థలు నిల్చాయి. కానీ కొ న్నాళ్లుగా టాప్ 500 కంపెనీల్లో మొత్తం ఈక్విటీల్లో 50% పైగా కొనసాగిన ప్రమోటర్ల వాటా క్రమంగా తగ్గుముఖం పట్టింది.
డీఐఐలు అప్:
2015లో దేశీయ టాప్ కంపెనీల్లో ప్రమోటర్ల వాటా 52.1 శాతంగా ఉండగా, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు 22.8%, దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లకు 10.8% వాటా ఉండేది. దశాబ్దం తిరిగే సరికి దేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల వాటాలు 19.2 శాతానికి ఎగియగా, ప్రమోటర్ల వాటాలు 49.5 శాతానికి, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల వాటా 18.8 శాతానికి తగ్గింది. గత అయిదేళ్లుగా దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (డీ ఐఐ) ఆధిపత్యం క్రమంగా పెరుగుతోంది. స్టాక్ మార్కెట్లపై ఇన్వెస్టర్లలో ఆస క్తి పెరిగి, ఈక్విటీ మ్యుచువల్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్‌లోకి అ సాధారణ స్థాయిలో పెట్టుబడులు ప్రవహిస్తుండటం ఇందుకు దోహదపడుతోంది.