హుజూరాబాద్లో అఖిలపక్షం ధర్నా | All party leaders protests at huzurabad | Sakshi
Sakshi News home page

హుజూరాబాద్లో అఖిలపక్షం ధర్నా

Aug 8 2015 12:57 PM | Updated on Sep 3 2017 7:03 AM

ముఖ్యమంత్రి కేసీఆర్ చాంబర్ ఎదుట ధర్నాకు దిగిన అఖిలపక్ష నాయకులను అరెస్టు చేయడాన్ని విపక్షాలు తీవ్రంగా తప్పు పడుతున్నాయి.

కరీంనగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ చాంబర్ ఎదుట ధర్నాకు దిగిన అఖిలపక్ష నాయకులను అరెస్టు చేయడాన్ని విపక్షాలు తీవ్రంగా తప్పు పడుతున్నాయి. అందులోభాగంగా అఖిలపక్షం నాయకులు శనివారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో రాస్తారోకా నిర్వహించారు. రహదారిపై బైఠాయించి... కేసీఆర్ ప్రభుత్వాన్నికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

దాంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి అఖిలపక్షం నాయకులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. వారిపై కేసు నమోదు చేశారు. అయితే ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement