
మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య
మట్కాకు అలవాటు పడి మద్యానికి బానిస కావడంతో కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వికారాబాద్ రూరల్ : మట్కాకు అలవాటు పడి మద్యానికి బానిస కావడంతో కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కథనం మేరకు.. మండల పరిధిలోని నారాయణపూర్‌కి అనుబంధ గ్రామమైన చింతలబొగూడకు చెందిన బార్గవ్ (25), మున్సిపల్ పరిధిలోని కొత్తగడిలో టెంట్‌హౌస్ నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. కొన్నినెలలుగా మట్కాతో పాటు మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి వరకు మట్కా ఆడిన భార్గవ్ ఫుల్‌గా మద్యం సేవించి ఇంటికి చేరుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని మందలించారు. ఈ క్రమంలో భార్గవ్, కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం చేసుకుంది. కాగా.. ఇంట్లో అందరూ పండుకున్న తరువాత రాత్రి 11.30 సమయంలో చీరతో దూలానికి ఉరేసుకున్నాడు. ఈ విషయం గమనించిన భార్య లలిత కుటుంబ సభ్యుల సాయంతో వికారాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు రెఫర్ చేయడంతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం 8.30 గంటలకు మృతి చెందాడు. భార్య లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవీందర్ తెలిపారు.