విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారి ఒకరు లంచం తీసుకుంటూ దొరికిపోయారు.
విజయవాడ: విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారి ఒకరు లంచం తీసుకుంటూ దొరికిపోయారు. కార్పొరేషన్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ శివశంకర్ ఓ కాంట్రాక్టర్‌కు చెందిన రూ.38 లక్షల బిల్లును మంజూరు చేసేందుకు రూ.50 వేలు డిమాండు చేశాడు. దీంతో ఆ కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
వారి సూచన మేరకు గురువారం మధ్యాహ్నం ఆ అధికారికి ఆయన చాంబర్‌లోనే రూ.50వేలు ఇస్తుండగా మాటువేసి ఉన్న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. గతంలో రాజమహేంద్రవరం కార్పొరేషన్ లో పనిచేస్తున్న సమయంలో ఇదే తరహాలో శివశంకర్ పట్టుబడినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.