మావల ఎఫ్‌బీవోపై మేకల కాపరి దాడి | a person attack on officer | Sakshi
Sakshi News home page

మావల ఎఫ్‌బీవోపై మేకల కాపరి దాడి

Sep 18 2016 12:03 AM | Updated on Sep 4 2017 1:53 PM

మండలంలోని మావల ఫారెస్టు బీట్‌ ఆఫీసర్‌ శంకరయ్యపై గుడిహత్నూర్‌ మండలం సీతగొంది గ్రామానికి చెందిన మేకల కాపరి మల్లేశ్‌ గొడ్డలితో దాడి చేశాడు.

ఆదిలాబాద్‌ రూరల్‌ : మండలంలోని మావల ఫారెస్టు బీట్‌ ఆఫీసర్‌ శంకరయ్యపై గుడిహత్నూర్‌ మండలం సీతగొంది గ్రామానికి చెందిన మేకల కాపరి మల్లేశ్‌ గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటన శనివారం చోటు చేసుకుంది. బీట్‌ ఆఫీసర్‌ శంకరయ్య, ఆదిలాబాద్‌ రూరల్‌ ఎస్సై తిరుపతి కథనం ప్రకారం.. మేకల కాపరి మల్లేశ్‌ శనివారం మావల అటవీ ప్రాంతాంలో మేకలను మేపడానికి వచ్చాడు.
    ఘటన జరిగే కొద్ది రోజుల మందు మేకలను మేపుకో కాని చెట్లను మాత్రం నరికి వేయకూడదని మేకల కాపరి వద్ద ఉన్న గొడ్డలిని లాక్కునాడు ఆఫీసర్‌. అయినాlమరుసాటి రోజు కూడా గొడ్డలి తీసుకువచ్చాడు సదురు కాపరి. దీంతో గతంలోనే చెప్పినా ఇంకా ఎందుకు గొడ్డలి తీసుకోవచ్చావు అని ప్రశ్నించిన్నందుకు ఎఫ్‌బీవోపై దాడి చేశాడు. అప్రమతమైన బీట్‌ఆఫీసార్‌ శంకరయ్య తప్పించుకోవడంతో ద్విచక్ర వాహనం సీటుపై గొడ్డలి దెబ్బ పడింది. దీంతో ప్రమాదం తప్పింది. అనంతరం ఆదిలాబాద్‌ రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీట్‌ఆఫీసార్‌ శంకరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన్నట్లు ఎస్సై తెలిపారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement