తాగి వాహనాలు నడిపిన 9 మందికి జైలు | 9 people jailed in drunk and drive case | Sakshi
Sakshi News home page

తాగి వాహనాలు నడిపిన 9 మందికి జైలు

Aug 16 2016 11:27 PM | Updated on May 25 2018 2:06 PM

మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ 9 మందికి ములుగు సివిల్‌ కోర్టు జైలు శిక్ష విధించింది.

 తాగి వాహనాలు  నడిపిన 9 మందికి జైలు
ములుగు : మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ 9 మందికి ములుగు సివిల్‌ కోర్టు జైలు శిక్ష విధించింది. వరంగల్‌కు చెందిన లింగంపల్లి సత్యనారాయణ, హన్మకొండకు చెందిన న న్నెబోయిన విజయ్‌కుమార్, హైదరాబాద్‌కు చెందిన ముక్కె విష్ణు,  మెదక్‌కు చెందిన కాంతం కుమార్, నల్గొండకు చెందిన గాదం కిశోర్, పోతరాజుపల్లికి చెందిన మోకిడి నగేశ్, తాడ్వాయికి చెందిన మెట్టపల్లి సతీశ్, ఎండీ.నయీం , జనగామకు చెందిన నిడిగొండ నర్సింహులు కు రెండు రోజుల జైలు శిక్షతో పాటు రూ. 2,100 జరిమానా విధించారు. గత ఆది, సోమవారాల్లో నిర్వహించిన తనిఖీలలో మొత్తం 25 మంది పట్టుబడ్డారని పేర్కొన్నారు. వారిని కోర్టులో హాజరుపర్చగా 16 మందికి రూ.2,100 జరిమానా, తొమ్మిది మందికి జైలు శిక్ష విధించారని ఎస్సై మల్లేశ్‌యాదవ్‌ తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement