విశాఖ జిల్లా రోలుగుంట పోలీసులు బుధవారం ఉదయం 88 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.
రోలుగుంట: విశాఖ జిల్లా రోలుగుంట పోలీసులు బుధవారం ఉదయం 88 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మండలంలోని బీబీపట్నం గ్రామానికి చెందిన విస్సారపు వెంకట్రావు, మరో వ్యక్తితో కలసి నాలుగు బస్తాల్లో గంజాయిని నింపుకున్నాడు. దానిని గ్రామ సమీపంలోని చెరువు వద్దకు తరలించి, వాహనం కోసం వేచి చూస్తున్నారు. ఇంతలోనే అటుగా వచ్చిన పోలీసులు అనుమానంతో వారిని ప్రశ్నించారు. సోదా చేయగా గంజాయి బయటపడింది. గంజాయి సహా వెంకట్రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. గంజాయి విలువ రూ.1.75 లక్షలు ఉంటుందని ఎస్సై గోవిందరావు తెలిపారు.