రోడ్డు ప్రమాదంలో ఏడుగురికి గాయాలు | 7injured in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఏడుగురికి గాయాలు

May 23 2017 7:39 PM | Updated on Aug 30 2018 4:10 PM

రోడ్డు ప్రమాదంలో ఏడుగురికి గాయాలు - Sakshi

రోడ్డు ప్రమాదంలో ఏడుగురికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఏడుగురు వైఎస్సార్‌ జిల్లా వాసులకు గాయాలయ్యాయి.

త్రిపురాంతకం: రోడ్డు ప్రమాదంలో ఏడుగురు వైఎస్సార్‌ జిల్లా వాసులకు గాయాలయ్యాయి. కర్నూలు– గుంటూ రు జాతీయ రహదారిపై త్రిపురాంతకం మండలంలోని ఉమ్మడివరం సమీపంలో సోమవారం ఈ ప్రమాదం జరిగింది. వైఎస్సార్‌ జిల్లా దువ్వూరు మండలం ముదిరేపల్లికి చెందిన వారు గుంటూరు జిల్లా నరసరావుపేట ప్రాంతంలోని కోటప్పకొండకు మొక్కు తీర్చుకునేందుకు తుఫాన్‌ వాహనంలో వెళ్తున్నారు.

స్పీడ్‌బ్రేకర్‌ వద్ద ఓ లారీ స్లో కావడంతో వెనుక వేగంగా వస్తున్న వీరి తుఫాన్‌ వాహనం ఢీకొట్టింది. దానిలోని గువ్వల లింగా రెడ్డి, జ్యోత్స్న, సావిత్రి, టి.శివారెడ్డి, సుహాసిని, హమీర్‌బాషా, మరొకరు గాయపడ్డారు. వీరిని వినుకొండలోని వైద్యశాలకు తరలించగా, చికిత్స పొందుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement