రెండు బైక్‌లు ఢీకొని ఆరుగురికి గాయాలు | 6 persons wounded in accident | Sakshi
Sakshi News home page

రెండు బైక్‌లు ఢీకొని ఆరుగురికి గాయాలు

Sep 27 2016 12:31 AM | Updated on Apr 3 2019 7:53 PM

రెండు బైక్‌లు ఢీకొని ఆరుగురికి గాయాలు కాగా వారిలో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన మానుకోట శివారు ఇల్లందు రోడ్డులో సోమవారం జరిగింది. ఎస్సై తిరుపతి కథనం ప్రకారం.. బాబునాయక్‌తండాకు చెందిన బానోత్‌ కిరణ్‌, పత్తిపాకకు చెందిన తుపాకుల యాకయ్య, ఐలపాక సురేష్‌ పల్సర్‌ బైక్‌ పైన పనిమీద ఇల్లందు రోడ్డులోని న్యూవిజన్‌ పాఠశాల సమీపంలోని పైపుల షాపునకు వెళ్లారు. పైపులు తీసుకొని వారు బైక్‌పై ఎక్కి కూర్చున్నారు.

మహబూబాబాద్‌ : రెండు బైక్‌లు ఢీకొని ఆరుగురికి గాయాలు కాగా వారిలో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన మానుకోట శివారు ఇల్లందు రోడ్డులో సోమవారం జరిగింది. ఎస్సై తిరుపతి కథనం ప్రకారం.. బాబునాయక్‌తండాకు చెందిన బానోత్‌ కిరణ్‌, పత్తిపాకకు చెందిన తుపాకుల యాకయ్య, ఐలపాక సురేష్‌ పల్సర్‌ బైక్‌ పైన పనిమీద ఇల్లందు రోడ్డులోని న్యూవిజన్‌ పాఠశాల సమీపంలోని పైపుల షాపునకు వెళ్లారు. పైపులు తీసుకొని వారు బైక్‌పై ఎక్కి కూర్చున్నారు. సరిగ్గా అదే సమయంలో మండలంలోని కంబాలపల్లి గ్రామానికి చెందిన ముఖేష్‌, బి.అనీల్‌, దేవరాజ్‌ మరో పల్సర్‌ బైక్‌పై స్వగ్రామానికి వెళుతూ షాపు ఎదుట బయల్దేరడానికి సిద్ధంగా ఉన్నవారి బైక్‌ను ఢీకొట్టారు. దీంతో రెండు బైక్‌లపై కూర్చున్న ఆరుగురికి గాయాలయ్యాయి. వీరిలో ముఖేష్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మిగిలిన వారికి కూడా గాయాలయ్యాయి. ఎస్సై తిరుపతి కేసు  దర్యాప్తు చేస్తున్నారు.  
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement