breaking news
illandu road
-
ఇల్లందు మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
భద్రాద్రి కొత్తగూడెం: ఇల్లందు మున్సిపల్ కార్యాలయం ముందు ఉద్రిక్తత కొనసాగుతోంది. మూడో వార్డు కౌన్సిలర్ కొక్కు నాగేశ్వరరావును ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఆయన అనుచరులు కిడ్నాప్ చేశారని మున్సిపల్ కార్యాలయం ముందు నాగేశ్వరరావు భార్య, కూతురు ఆందోళన చేస్తున్నారు. బలవంతంగా తన భర్తను కాంగ్రెస్ వాళ్లు తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇల్లందుల్లో నేడు జరగనున్న అవిశ్వాసానికి ముందు ఈ వ్యవహారంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలపడంతో మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు 144 సెక్షన్‌ను విధించారు. పోలీసులు సరైన భద్రత కల్పించకపోవడం వల్లే తమ భర్తను కాంగ్రెస్ వాళ్ళు బలవంతంగా కారులో ఎక్కించుకొని వెళ్లారని నాగేశ్వరావు భార్య ఆరోపిస్తోంది. ఇల్లందు మున్సిపల్‌కి సంబంధించి మొత్తం 24 మంది కౌన్సిలర్లలో 19 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు ,ముగ్గురు ఇండిపెండెంట్ లు ,ఒకరు సీపీఐ, ఒకటి న్యూ డెమోక్రసీ చెందిన కౌన్సిలర్ ఉన్నారు. అవిశ్వాసం నెగ్గాలంటే బీఆర్ఎస్ పార్టీకి 17 మంది కౌన్సిలర్లు అవసరం. ఇదీ చదవండి: కాంగ్రెస్ మాటల ప్రభుత్వం -
రెండు బైక్‌లు ఢీకొని ఆరుగురికి గాయాలు
మహబూబాబాద్ : రెండు బైక్‌లు ఢీకొని ఆరుగురికి గాయాలు కాగా వారిలో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన మానుకోట శివారు ఇల్లందు రోడ్డులో సోమవారం జరిగింది. ఎస్సై తిరుపతి కథనం ప్రకారం.. బాబునాయక్‌తండాకు చెందిన బానోత్ కిరణ్, పత్తిపాకకు చెందిన తుపాకుల యాకయ్య, ఐలపాక సురేష్ పల్సర్ బైక్ పైన పనిమీద ఇల్లందు రోడ్డులోని న్యూవిజన్ పాఠశాల సమీపంలోని పైపుల షాపునకు వెళ్లారు. పైపులు తీసుకొని వారు బైక్‌పై ఎక్కి కూర్చున్నారు. సరిగ్గా అదే సమయంలో మండలంలోని కంబాలపల్లి గ్రామానికి చెందిన ముఖేష్, బి.అనీల్, దేవరాజ్ మరో పల్సర్ బైక్‌పై స్వగ్రామానికి వెళుతూ షాపు ఎదుట బయల్దేరడానికి సిద్ధంగా ఉన్నవారి బైక్‌ను ఢీకొట్టారు. దీంతో రెండు బైక్‌లపై కూర్చున్న ఆరుగురికి గాయాలయ్యాయి. వీరిలో ముఖేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మిగిలిన వారికి కూడా గాయాలయ్యాయి. ఎస్సై తిరుపతి కేసు దర్యాప్తు చేస్తున్నారు.