రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలు | 6 injured in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలు

Nov 29 2016 10:55 PM | Updated on Aug 30 2018 4:07 PM

శింగనమల మండలం బండమీదపల్లి వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు.

శింగనమల : శింగనమల మండలం బండమీదపల్లి వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు... పెరవలి నుంచి కూలీలతో వెళ్తున్న ఆటోను శివపురం  నుంచి వస్తున్న నీళ్ల ట్యాంకర్‌ ట్రాక్టర్‌ ఢీ కొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న కూలీలు గాయపడ్డారన్నారు. గాయపడిన వారిలో రాజకుళ్లాయప్ప, నల్లమ్మ, రమాదేవి, చామండి, కుళ్లాయమ్మ, బయక్క ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అనంతపురము ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement