మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం | 5 killed in road mishap in mahaboobnager district | Sakshi
Sakshi News home page

మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Mar 7 2016 11:35 AM | Updated on Oct 8 2018 5:07 PM

శివరాత్రి పండుగను స్వస్థలంలో జరుపుకోవాలనుకుని కారులో బయలుదేరిన ఓ కుటుంబం.. మార్గం మధ్యలోనే మృత్యులోకాలకు చేరుకుంది..

మహబూబ్‌నగర్: శివరాత్రి పండుగను స్వస్థలంలో జరుపుకోవాలనుకుని కారులో బయలుదేరిన ఓ కుటుంబం.. మార్గం మధ్యలోనే మృత్యులోకాలకు చేరుకున్న విషాదకర సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నుంచి తమ స్వస్థలం కర్ణాటకలోని యాదగిరి జిల్లాకు సోమవారం కారులో బయలుదేరిన కుటుంబం.. కొడంగల్ శివారుల్లోని చిట్లపల్లి వద్ద ప్రమాదానికి గురైంది.

 

ఎదురుగా దూసుకొచ్చిన లారీ వారి కారును ఢీకొట్టడంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి, క్షతగాత్రులను 108 వాహనం ద్వారా కొడంగల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కారు నుజునుజ్జు కావడంతో మృతదేహాల వెలికితీత ఇబ్బందికరంగా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement