రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి | 3 killed in Hajipur in Mancherial | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

Nov 17 2016 9:47 AM | Updated on Aug 14 2018 3:25 PM

మంచిర్యాల జిల్లా హాజీపూర్ వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

మంచిర్యాల: మంచిర్యాలలోని హాజీపూర్ వద్ద గురువారం తెల్లవారుజామున  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి లారీని ఢీకొన్న ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు విశాఖ, మరొకరు హైదరాబాద్కు చెందినవారిగా గుర్తించారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


 

Advertisement
 
Advertisement
Advertisement