డీసీఎం,టిప్పర్ ఢీ: ముగ్గురు మృతి | 3 died in road accident | Sakshi
Sakshi News home page

డీసీఎం,టిప్పర్ ఢీ: ముగ్గురు మృతి

Jun 2 2016 3:39 PM | Updated on Apr 3 2019 7:53 PM

మేడ్చల్ పోలీస్‌ స్టేషన్ పరిధిలోని బాసిరేగిడి వద్ద గురువారం వేకువజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

శామీర్‌పేట్ (రంగారెడ్డి జిల్లా) : మేడ్చల్ పోలీస్‌ స్టేషన్ పరిధిలోని బాసిరేగిడి వద్ద గురువారం వేకువజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గండిమైసమ్మ నుంచి మేడ్చల్ వైపు వెళ్తోన్న డీసీఎం మేడ్చల్ నుంచి దుండిగల్ వైపు వెళ్తోన్న టిప్పర్ ఢీకొన్నాయి.ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ రాజు, టిప్పర్ డ్రైవర్ రితులాల్ మహతో(జార్ఖండ్ రాష్ట్రానికి చెందినవాడు) అక్కడికక్కడే మృతిచెందగా..డీసీఎం క్లీనర్ మైబు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement