ఒకటో స్థాయి సంఘం సమావేశం వాయిదా | 1ST STANDING COMITEE MEETING CANCELED | Sakshi
Sakshi News home page

ఒకటో స్థాయి సంఘం సమావేశం వాయిదా

Aug 31 2016 12:22 AM | Updated on Sep 4 2017 11:35 AM

జిల్లా ప్రజాపరిషత్‌ 1వ స్థాయి సంఘం సమావేశం వాయిదాపడింది. మంగళవారం హన్మకొండలోని జిల్లా ప్రజాపరిషత్‌ కార్యాలయంలో చైర్‌పర్సన్‌ గద్దల పద్మ అధ్యక్షతన జరిగిన సమావేశానికి వివిధ శాఖల అధికారులు గైర్హాజరయ్యారు.

హన్మకొండ : జిల్లా ప్రజాపరిషత్‌ 1వ స్థాయి సంఘం సమావేశం వాయిదాపడింది. మంగళవారం హన్మకొండలోని జిల్లా ప్రజాపరిషత్‌ కార్యాలయంలో చైర్‌పర్సన్‌ గద్దల పద్మ అధ్యక్షతన జరిగిన సమావేశానికి వివిధ శాఖల అధికారులు గైర్హాజరయ్యారు. దీంతో హాజరైన సభ్యులు సమావేశాన్ని వాయిదా వేయాలని కోరారు. దీంతో చైర్‌పర్సన్‌ గద్దల పద్మ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీన్ని తిరిగి సెప్టెంబర్‌ 1న నిర్వహించనున్నట్లు తెలిపారు. జెడ్పీ సీఈఓ ఎస్‌.విజయ్‌గోపాల్, జెడ్పీటీసీ సభ్యులు మూలగుండ్ల వెంకన్న, లేతాకుల సంజీవరెడ్డి, పాడి కల్పన, పాలకుర్తి సారంగపాణి, స్వామినాయక్‌ హాజరయ్యారు. 

Advertisement
 
Advertisement
Advertisement