ఎయిరిండియా కీలక ప్రకటన.. ఆ దేశానికి విమానాలు రద్దు | Air India Cancels Flights To Israel Until May 31 Amid Escalating West Asia Conflict, More Details Inside | Sakshi
Sakshi News home page

ఎయిరిండియా కీలక ప్రకటన.. ఆ దేశానికి విమానాలు రద్దు

Apr 6 2026 4:00 AM | Updated on Apr 6 2026 3:45 PM

Air India cancels flights to Israel

ఎయిర్‌ ఇండియా కీలక ప్రకటన చేసింది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో  ఇజ్రాయెల్ వెళ్లే  విమాన సర్వీసులని తాత్కాలికంగా రద్దు చేసినట్లు పేర్కొంది.

పశ్చిమాసియా యుద్ధం మెుదలై దాదాపు నెలరోజులు గడుస్తోన్నా ఇంకా పరిస్థితులు సద్దుమణగడం లేదు కదా పరిస్థితులు మరింతగా ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనేపథ్యంలోనే ఎయిర్‌ఇండియా కీలక ప్రకటన చేసింది. మే 31 వరకూ టెల్‌ అవీవ్ వెళ్లే అన్ని విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది.

ఎయిర్‌ఇండియాతో పాటు మరికొన్ని విమానాయాన సంస్థలు సైతం ఇజ్రాయెల్‌కు తమ సర్వీసులను నిలిపివేసినట్లు తెలుస్తోంది.  ఇజ్రాయెల్‌లో దాదాపు 40 వేల వరకూ భారతీయులు నివసిస్తున్నారు. స్వదేశానికి రావాలనుకునేవారు జోర్దాన్‌, ఈజిప్టు మీదుగా భారత్‌ చేరుకోవచ్చు. 

Advertisement
 
Advertisement
Advertisement