అమరావతి చుట్టూ 185 కిలోమీటర్ల రింగ్రోడ్డు | 185 kilometers of ring road around amaravathi capital region | Sakshi
Sakshi News home page

అమరావతి చుట్టూ 185 కిలోమీటర్ల రింగ్రోడ్డు

Sep 28 2015 2:01 PM | Updated on Aug 18 2018 5:48 PM

అమరావతి చుట్టూ 185 కిలోమీటర్ల రింగ్రోడ్డు - Sakshi

అమరావతి చుట్టూ 185 కిలోమీటర్ల రింగ్రోడ్డు

అమరావతి చుట్టూ 185 కిలోమీటర్ల రింగ్ రోడ్డు వేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతోపాటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 800 కిలోమీటర్ల రోడ్లను జాతీయ రహదారులుగా మార్చనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

అమరావతి చుట్టూ 185 కిలోమీటర్ల రింగ్ రోడ్డు వేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతోపాటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 800 కిలోమీటర్ల రోడ్లను జాతీయ రహదారులుగా మార్చనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించనున్నారు. కర్నూలు మీదుగా అనంతపురం, అమరావతిని కలుపుతూ ఎన్హెచ్ 44- ఎన్హెచ్ 65తో అనుసంధానించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది.

కర్నూలు, కడప, అనంతపురాలను కలుపుతూ ఎన్హెచ్ 40, ఎన్హెచ్ 60లను అనుసంధానించనున్నారు. ప్రస్తుతం నాలుగు లేన్లుగా ఉన్న రహదారులను 6, 8 లేన్ల జాతీయ రహదారులుగా మారుస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను పూర్తిచేస్తే పనులు వెంటనే ప్రారంభిస్తామని కేంద్రం తెలిపింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement