గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో నామినేషన్లు వెల్లువెత్తాయి. మొత్తం 58 డివిజన్లకు 1350 నామినేషన్లు దాఖలయ్యాయి.
సాక్షి ప్రతినిధి, వరంగల్: గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో నామినేషన్లు వెల్లువెత్తాయి. మొత్తం 58 డివిజన్లకు 1350 నామినేషన్లు దాఖలయ్యాయి. అధికార టీఆర్‌ఎస్ నుంచి అత్యధికంగా 579 నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ తరఫున 188, బీజేపీ నుంచి 114, టీడీపీ నుంచి 91, సీపీఎం నుంచి 22, వైఎస్సార్‌సీపీ 15, సీపీఐ నుంచి ఎనిమిది, బీఎస్పీ నుంచి ఆరు, ఎంఐఎం నుంచి మూడు, స్వతంత్రులు తరఫున 224 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల దాఖలు గడువు బుధవారం ముగియగా ఉపసంహరణల ప్రక్రియ శుక్రవారం జరగనుంది. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ వదిన స్వర్ణలతకు, రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి కోడలు అశ్రీతరెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ సోదరుడు విజయభాస్కర్‌కు టీఆర్‌ఎస్ టికెట్లు ఇచ్చింది.
ఖమ్మంలో 587 నామినేషన్లు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలో మొత్తం 587మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు అయ్యాయి. వీరిలో బీజేిపీ-12, సీపీఐ -20, సీపీఎం -53, కాంగ్రెస్ - 93, టీడీపీ-87, టీఆర్‌ఎస్ -139, వైఎస్సార్‌సీపీ -68, స్వతంత్ర అభ్యర్థులు 115 మంది నామినేషన్లు దాఖలు చేశారు.