లాటరీ మోసాలకు పాల్పడుతున్న 11మంది అరెస్ట్ | 11 arrested for cheating | Sakshi
Sakshi News home page

లాటరీ మోసాలకు పాల్పడుతున్న 11మంది అరెస్ట్

Sep 27 2016 7:01 PM | Updated on Sep 4 2017 3:14 PM

ఎలాంటి అనుమతులు లేకుండా లాటరీల ద్వారా మోసాలకు పాల్పడుతున్న 11మందిని మదనపల్లిలో పోలీసులు అరెస్ట్ చేశారు.

మదనపల్లి (చిత్తూరు జిల్లా) : ఎలాంటి అనుమతులు లేకుండా లాటరీల ద్వారా మోసాలకు పాల్పడుతున్న 11మందిని మదనపల్లిలో పోలీసులు అరెస్ట్ చేశారు. మదనపల్లి కేంద్రంగా రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో ఏజెంట్లను పెట్టుకుని వీళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. వీరి దగ్గర నుంచి 15 సెల్‌ఫోన్లతో పాటు, పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement