మార్కులు తక్కువగా వచ్చాయని.. | 10th student commit suicide in in chittoor district | Sakshi
Sakshi News home page

మార్కులు తక్కువగా వచ్చాయని..

May 11 2016 7:12 PM | Updated on Nov 9 2018 4:36 PM

పదో తరగతి పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చాయని ఓ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది.

గుడిపాల: పదో తరగతి పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చాయని ఓ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్‌ఐ లక్ష్మీకాంత్ కథనం ప్రకారం... చిత్తపార జెడ్పీ హైస్కూల్‌లో కుసుమ(15) పదో తరగతి చదివి పరీక్షలు రాసింది. మంగళవారం వెలువడిన ఫలితాల్లో 8.2 పాయింట్లు రావడంతో మనస్తాపానికి గురైంది. తన అవ్వగారి ఊరైన ముట్టుకూరుపల్లె గ్రామానికి వచ్చిన ఆమె మంగళవారం రాత్రి ఉరేసుకుంది. కుటుంబ సభ్యులు చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement