అమెరికాలో తెలుగు వైద్యుడికి శిక్ష | telugu nri doctor convicted of fraud in US | Sakshi
Sakshi News home page

అమెరికాలో తెలుగు వైద్యుడికి శిక్ష

Mar 9 2016 8:16 PM | Updated on Jul 6 2019 12:42 PM

అమెరికాలో తెలుగు వైద్యుడికి శిక్ష - Sakshi

అమెరికాలో తెలుగు వైద్యుడికి శిక్ష

అమెరికాలో జరిగిన ఓ మెడికల్ కుంభకోణంలో భారతీయ మూలాలున్న వైద్యుడిని అమెరికా కోర్టు దోషిగా తేల్చింది.

న్యూయార్క్: అమెరికాలో జరిగిన ఓ మెడికల్ కుంభకోణంలో భారతీయ మూలాలున్న వైద్యుడిని అమెరికా కోర్టు దోషిగా తేల్చింది. జడ్జి అతనికి శిక్ష, జరిమానా విధించారు. షికాగోలోని ఓ ఆసుపత్రి రోగులకు సంబంధించి ఫెడరల్ హెల్త్‌కేర్ ప్రోగ్రామ్ కింద రావాల్సిన మెడికల్ రీయింబర్స్‌మెంట్ నిధులను కాజేశారని కూచిపూడి వెంకటేశ్వరరావు అనే తెలుగు వైద్యుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఈ విషయమై అక్కడి కోర్టు ఐదు నెలలుగా విచారణ చేపట్టి అతడిని దోషిగా నిర్ధారించింది. ఈ కుంభకోణం మూలంగా సేక్రెడ్ హార్ట్ అనే ఆసుపత్రి మూతపడింది. రోగులకు సంబంధించి నిధులను మంజూరు చేసే అధికారం కలిగిన కూచిపూడి వెంకటేశ్వరరావు లంచాలు తీసుకొని అక్రమాలకు తెరలేపారని పేర్కొంది.
 

Advertisement
 
Advertisement
Advertisement