సినారె పేరుతో 'ఆటా' అవార్డు | ATA paid obituary to Dr SiNaRe at Atlanta | Sakshi
Sakshi News home page

సినారె పేరుతో 'ఆటా' అవార్డు

Jun 16 2017 8:09 PM | Updated on Sep 5 2017 1:47 PM

సినారె పేరుతో 'ఆటా' అవార్డు

సినారె పేరుతో 'ఆటా' అవార్డు

ప్రముఖ తెలుగు కవి, జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత డా. సి. నారాయణరెడ్డికి అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఘన నివాళులు అర్పించింది.

అట్లాంటా :
ప్రముఖ తెలుగు కవి, జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత డా. సి. నారాయణరెడ్డికి అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఘన నివాళులు అర్పించింది. అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో అట్లాంటాలో సినారె సంతాప సభ జరిగింది. ఆటా సభ్యులు డా.సి. నారాయణరెడ్డి మృతిపై తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. డా. సి. నారాయణరెడ్డి జ్ఞాపకార్థం తదుపరి ఆటాసమావేశాల్లో సినారె అవార్డును ప్రవేశపెట్టనున్నట్టు ఆటా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి ఆసిరెడ్డి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు అనిల్ బొడ్డిరెడ్డి, వేణు పిసికె, కిరణ్ పాశం, మిగతా ఆటా సభ్యులు ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆటా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా పలుమార్లు సినారె వచ్చిన విషయాలను కరుణాకర్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఆటా సమావేశాల సందర్భంగా స్వాగత గీతం రాయడానికి సినారె చేసిన సహాయాన్ని డా. సంధ్యా గవ్వా మననం చేసుకున్నారు.




Advertisement
 
Advertisement
Advertisement