పిన్ని ఇంటికే కన్నం

Young Woman Robbery In Her Aunt Home - Sakshi

ఇద్దరు దొంగల రిమాండ్

నల్లకుంట: స్వంత పిన్ని ఇంట్లో  బంగారు ఆభరణాలు, నగదు చోరీ చేసిన యువతి, ఆమెకు సహకరించిన స్నేహితుడిని నల్లకుంట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సోమవారం నల్లకుంట పీఎస్‌లో డీఐ కె.సైదులు, డీఎస్సై కోటేశ్వర్‌ రావు వివరాలు వెల్లడించారు. అడిక్‌మెట్‌ రాంనగర్‌ గుండు సమీపంలో ఉంటున్న  నేదునూరి నాగప్రసన్న, భవాని శంకర్‌ దంప తులు కుటుంబంతో కలిసి ఈ నెల 6న బంధువుల ఇంట్లో ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి వచ్చేసరిగి అల్మారాలో ఉన్న 7.5 తులాల బంగారు నగలు, రూ.75 వేల నగదు కనిపించకపోవడంతో భవాని శంకర్‌ నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనుమానంతో బాగ్‌ అంబర్‌పేట వైభవ్‌ నగర్‌లో ఉంటున్న నాగప్రసన్న అక్క కుమార్తె సుప్రజా మూర్తి అలియాస్‌ జాహ్నవి మూర్తి సోమవారం అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించింది. దారుసలాంలో ఉండే స్నేహితుడు విశాల్‌ అగర్వాల్‌తో చోరీకి పాల్పడినట్లు తెలిపింది. నిందితులను అరెస్టున పోలీసులు చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్‌కు తరలించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top