ఇదే నా చివరి వీడియోకాల్‌.. | Young Man Died After Video Call to Family in Vikarabad | Sakshi
Sakshi News home page

ఇదే నా చివరి వీడియోకాల్‌..

Oct 1 2019 8:51 AM | Updated on Oct 1 2019 8:51 AM

Young Man Died After Video Call to Family in Vikarabad - Sakshi

సునీల్‌కుమార్‌ మృతదేహం

కుటుంబీకులకు వీడియో కాల్‌ చేసి వ్యక్తి ఆత్మహత్య  

హయత్‌నగర్‌: కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి కుటుంబీకులకు వీడియో కాల్‌ చేసి కూల్‌డ్రింక్‌లో విషం కలుపుకొని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హయత్‌నగర్‌ పోలీసుల కథనం ప్రకారం.. జీడిమెట్లకు చెందిన సునీల్‌కుమార్‌రెడ్డి(30), శశికళ దంపతులు. సునీల్‌ ఓ ప్రైవేటు ఉద్యోగి. భార్యాభర్తలకు సంతానం కలగలేదు. భార్యతో విభేదాల కారణంగా తనకు విడాకులు ఇవ్వాలని కొంతకాలంగా సునీల్‌కుమార్‌రెడ్డి శశికళను కోరుతున్నాడు. దీనికి ఆమె అంగీకరించడం లేదు.

ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన ఆయన ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో పురుగుల మందును కూల్‌డ్రింక్‌లో కలుపుకొని యాక్టివాపై పస్మాములలోని ఓ వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. తన అన్న, తల్లికి వీడియోకాల్‌ చేసి నేను చనిపోతున్నాను.. ఇదే చివరి కాల్‌ అని చెప్పి పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి వద్ద దొరికిన ఆధారాలను ద్వారా అతడిని సునీల్‌కుమార్‌రెడ్డిగా గుర్తించారు. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నాను.  

Advertisement
 
Advertisement
Advertisement